News October 10, 2025

ట్రంపు నిట్టూర్పు! ఇంకెన్ని యుద్ధాలాపితే దొరికేనో ‘శాంతి’

image

‘ఇంకా నేను ఎన్ని యుద్ధాలు ఆపాలి’, ‘ఇంకేం చేయాలి’ అని ట్రంప్ బాధపడుతున్నారేమో. ఎన్నో ఆశలు పెట్టుకున్న నోబెల్ ప్రైజ్ రాకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందే ఉంటారు. తనకు ప్రైజ్ రాదని బయటకు ఎంత చెప్పుకున్నా లోలోపల ఉన్న చిన్న ఆశ నేటితో సమాధి అయింది. దీంతో ట్రంప్ ఏ దేశంపై ఏ రూపంలో విరుచుకుపడతారో అనే ఆందోళన లేకపోలేదు. ఇప్పుడు మిస్ అయినా వచ్చే ఏడాది దక్కించుకోవడానికి ఏం చేస్తారోనని నెట్టింట చర్చ జరుగుతోంది.

Similar News

News October 10, 2025

బిహార్‌లో రేపు NDA కూటమి సమావేశం

image

త్వరలో బిహార్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో NDA కూటమి రేపు అక్కడ కీలక సమావేశం నిర్వహించనుంది. JDU, BJPతో పాటు కూటమిలోని ఇతర పార్టీల సీట్ల పంపకాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 243 సీట్లలో జేడీయూ, బీజేపీ 205 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏయే స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి విడత ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

News October 10, 2025

గర్భిణులు, తల్లులకు అలర్ట్!

image

గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు తల్లులకు, పిల్లల మొదటి 1,000 రోజుల్లో వారికి అదనంగా చక్కెర అందించొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘తక్కువ చక్కెర తీసుకునే చిన్నారులలో జ్ఞాపకశక్తి& ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. పెద్దయ్యాక షుగర్, BP ప్రమాదం తగ్గుతుంది. తల్లి తీసుకునే పోషకాహారం బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్మిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
* ప్రతిరోజూ మహిళల కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>>పై క్లిక్ చేయండి

News October 10, 2025

సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

image

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.