News February 11, 2025

అవినీతి నిరోధక చట్టాన్ని సస్పెండ్ చేసిన ట్రంప్

image

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక పాత చట్టాల దుమ్ము దులిపేస్తున్నారు. US వ్యాపారాలకు విఘాతం కలిగిస్తోందని ఫెడరల్ చట్టం ‘FCPA’ను నిలిపేశారు. మరిన్ని మినహాయింపులు, ఉపశమనం కల్పించేలా సవరించాలని కొత్త అటార్నీ జనరల్ పామ్ బొండిని ఆదేశించారు. అమెరికన్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్స్ బిజినెస్ కోసం ఇతర దేశాల అధికారులకు లంచం ఇవ్వడం ఈ చట్ట ప్రకారం నేరం. అదానీపై FCPA ప్రకారమే అభియోగాలు మోపడం గమనార్హం.

Similar News

News October 17, 2025

మెడ దగ్గర నల్లగా ఉందా? ఈ టిప్స్ ట్రై చేయండి

image

హార్మోన్ల మార్పులు, ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి కొన్ని చిట్కాలున్నాయి. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15ని. తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేసి 20ని. తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్‌‌, కాఫీ పొడి, పసుపు కలిపి మెడకి రాసి ఆరాక స్క్రబ్ చేస్తే స్కిన్ మెరుస్తుంది.
* మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.

News October 17, 2025

వైట్ హెడ్స్ రాకుండా ఉండాలంటే?

image

ముక్కుపై చర్మరంధ్రాలు పెద్దగా ఉండటంతో నూనెలు, మృతకణాలు చేరి వైట్‌హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వీటికి కారణమంటున్నారు నిపుణులు. వీటిని తొలగించడానికి మినరల్ కాస్మెటిక్స్, టోనర్‌, మైల్డ్‌ క్లెన్సర్‌ వాడాలి. వారానికి 3సార్లు తలస్నానం చేయాలి. ఫోన్‌, పిల్లో కవర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. మేకప్ ప్రొడక్ట్స్ ఎవరితోనూ పంచుకోకూడదు. అయినా తగ్గకపోతే వైద్యుల సలహాతో యాంటీ బయాటిక్స్ వాడాలి.

News October 17, 2025

ప్రతి మండలానికి లైసెన్సుడ్ సర్వేయర్లు: శ్రీనివాసరెడ్డి

image

TG: భూసేవలు సులభంగా అందేలా మండలానికి 4-6 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూభారతి చట్టం అమలుకు ఇపుడున్న 350 మంది సర్వేయర్లు సరిపోరని అందుకే కొత్తగా 3465 మందిని తీసుకున్నామని చెప్పారు. శిక్షణ పొందిన వీరికి ఈనెల 19న CM ద్వారా లైసెన్సులు అందిస్తామని చెప్పారు. మరో 3వేల మందికి JNTU అర్హత పరీక్ష నిర్వహిస్తుందని, ఎంపికైన వారికి అప్రెంటీస్ శిక్షణ ఉంటుందన్నారు.