News August 27, 2025
ట్రంప్ టారిఫ్స్ ఉ.9.30 గంటల నుంచి అమల్లోకి..

భారత్‌పై ట్రంప్ విధించిన 25%(మొత్తం 50%) అదనపు టారిఫ్స్ ఇవాళ ఉ.9.30 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో మన దేశం నుంచి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడనుంది. రొయ్యలు, చెప్పులు, ఆభరణాలు, జౌళి వస్తువులు, దుస్తులు, జెమ్స్, జంతు ఉత్పత్తులు, రసాయనాలు, విద్యుత్, మెకానికల్ యంత్రాలపై ఎఫెక్ట్ ఉంటుంది. మెడిసిన్స్, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు లభించనుంది.
Similar News
News August 27, 2025
భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పురాతన ఇళ్లలో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలన్నారు. వాగులు, కాజ్‌వేలు, కల్వర్టులపై రాకపోకలు నిషేధించాలని చెప్పారు. చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని, అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
News August 27, 2025
నారా రోహిత్ ‘సుందరకాండ’ రివ్యూ&రేటింగ్

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘సుందరకాండ’ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. హీరో రోహిత్ నేచురల్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్లు శ్రీదేవీ విజయ్‌కుమార్, విర్తి వాఘని తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య కామెడీ మూవీకి పెద్ద ప్లస్. కానీ రొటీన్, ముందే ఊహించే సీన్లు ఇబ్బంది పెడతాయి. అసందర్భంగా వచ్చే సాంగ్స్ విసుగు తెప్పిస్తాయి. కథను వివరించడంలో డైరెక్టర్ వెంకటేశ్ తడబడ్డారు.
రేటింగ్: 2/5
News August 27, 2025
వధువులకు కానుకగా తుపాకులు, కత్తులు

మహిళలకు వారి వివాహ సమయంలో బంగారం, వెండి నగలకు బదులుగా ఆయుధాలు ఇవ్వాలని అఖిల భారత క్షత్రియ మహాసభ ప్రతిపాదించింది. వధువులకు కానుకగా తుపాకులు, కత్తులు ఇస్తే వారిని వారు రక్షించుకోవచ్చని అభిప్రాయపడింది. ఒకప్పుడు క్షత్రియ మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పద్ధతి తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. యూపీలోని గౌరిపూర్ మిట్లిలో జరిగిన ‘కేసరియా మహా పంచాయత్’లో ఈ తీర్మానం చేసింది.