News November 9, 2024
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్

US అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌నకు చెందిన నిర్మాణ సంస్థ HYDలో 2 భవనాలు నిర్మించనుంది. మంజీరా గ్రూప్‌తో కలిసి మాదాపూర్‌లోని ఖానామెట్‌లో వీటిని ఏర్పాటు చేయనుంది. అందుకు 2022లోనే 2.92 ఎకరాలను HMDA వేలంలో కొనుగోలు చేసింది. 27 అంతస్థుల్లో 4BHK, 5BHK అపార్ట్మెంట్లను నిర్మించనుంది. 4వేల Sft-6వేల Sft విస్తీర్ణంలోని ఈ ఫ్లాట్ల ధరను Sftకి రూ.13వేలుగా గతంలో నిర్ణయించింది. అంటే 4BHK ఫ్లాట్ ధర రూ.5.5 కోట్లు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. సంబంధిత శాఖ అధికారులతో కలిసి సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 24, 2025
TODAY HEADLINES

* వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం: మోదీ
* సింధ్ మళ్లీ INDలో కలవొచ్చు: రాజ్‌నాథ్
* AP: తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు
* సత్యసాయి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి: CBN
* బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్
* ‘రైతన్నా.. మీకోసం’ పబ్లిసిటీ స్టంటే: జగన్
* అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR
* రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఫ్రీగా చీరలు: పొన్నం
* SAతో ODI సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్
News November 24, 2025
ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకున్నా: మారుతి

ప్రభాస్ ఫొటో జేబులో పెట్టుకొని పనిచేశానని, ఆయన ఫొటో ఉంటే ఎవరైనా టాప్ డైరెక్టర్ అయిపోతారని మారుతి అన్నారు. ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ సందర్భంగా మాట్లాడారు. ‘ఫ్యాన్స్ కోసమే ప్రభాస్ <<18369126>>ఈ పాట <<>>చేశారు. కేరింతలతో థియేటర్స్ రీసౌండ్ వస్తాయి. ముగ్గురు హీరోయిన్స్‌తో ఆయన కెమిస్ట్రీ స్క్రీన్‌పై చూడాలి. రిలీజ్‌కు ముందే అందరూ రెబల్ ఆరాలో ఉంటారు. ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే వర్క్ చేస్తున్నా’ అని చెప్పారు.


