News January 21, 2025

కార్చిచ్చు రేగిన LAలో ట్రంప్ పర్యటన

image

అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్.. ప్రకృతి విధ్వంసం సృష్టించిన ప్రాంతాలకు వెళ్లనున్నారు. కార్చిచ్చుతో భారీగా నష్టపోయిన కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెలిస్‌లో శుక్రవారం పర్యటించనున్నారు. అలాగే నార్త్ కరోలినాలో హరికేన్ ప్రభావాన్ని పరిశీలించనున్నారు. ట్రంపునకు ఇదే తొలి అధికారిక పర్యటన.

Similar News

News January 18, 2026

మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

image

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.

News January 18, 2026

బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?

image

ప్రెగ్నెన్సీలో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి పీచు ఎక్కువగా ఉండే పప్పులు, బీన్స్‌, బఠానీ, బెర్రీ పండ్లు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌తీసుకోవాలి. కాల్షియం కోసం పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, గుడ్లు, సపోటా, చేపలు తీసుకోవాలి. ఐరన్ లోపం రాకుండా ఆప్రికాట్స్‌, కోడిగుడ్లలోని పచ్చసొన, చేపలు, డ్రైఫ్రూట్స్‌, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు, ఓట్స్‌, చిరుధాన్యాలు, గోధుమలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 18, 2026

హైదరాబాద్‌లో 248పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>HYD<<>>లోని ECILలో 248 గ్రాడ్యుయేట్(Engg.), డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హత గలవారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రొవిజినల్ సెలక్షన్ JAN 23న ప్రకటిస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in