News August 26, 2025
200% టారిఫ్స్ విధిస్తాం.. చైనాకు ట్రంప్ వార్నింగ్

USకు చైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై ఆపేస్తే 200% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘వాళ్లు మాకు మ్యాగ్నెట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే 200% టారిఫ్స్ విధించడం లేదా ఇంకేదైనా చేస్తాం. కానీ ఆ సమస్య రాదని భావిస్తున్నాం’ అని అన్నారు. త్వరలో చైనాలో పర్యటిస్తానంటూనే హెచ్చరించడం గమనార్హం. కాగా చైనాలోనే అత్యధికంగా ఉత్పత్తయ్యే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆటోమోటివ్, డిఫెన్స్ తదితర పరిశ్రమలకు కీలకం.
Similar News
News August 26, 2025
సెప్టెంబర్ 12న ‘మిరాయ్’ విడుదల

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈనెల 28న సరికొత్త ట్రైలర్‌తో అభిమానులను అలరిస్తామని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ ఫాంటసీ డ్రామా ఏడు భాషల్లో విడుదల కానుంది.
News August 26, 2025
విద్యుత్ ప్రమాదాలను నివారిద్దామిలా!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ షాక్స్ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇంట్లోని అతుకులున్న వైర్ల నుంచి విద్యుత్ పాస్ అయ్యే ప్రమాదం ఉంది. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకొద్దు. ప్లగ్స్, సాకెట్స్‌కు కవర్‌లు ఉండేలా చూసుకోండి. పిల్లలు వీటిని తాకకుండా జాగ్రత్త వహించాలి. ఇంట్లోకి వరద వస్తే వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఎర్తింగ్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయాలి’ అని తెలిపారు.SHARE IT
News August 26, 2025
వాన్‌పిక్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

AP మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో CBI ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలని వాన్‌పిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను TG హైకోర్టు కొట్టేసింది. 2022 JULలో వాన్‌పిక్ ప్రాజెక్టు పిటిషన్‌ను హైకోర్టు అనుమతించగా తమ వాదనలు పట్టించుకోకుండా ఉత్తర్వులు ఇచ్చిందంటూ CBI సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో మరోసారి విచారించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా వాదనలు విన్న హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.