News January 16, 2025

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ట్రంప్

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య <<15166636>>కాల్పుల విరమణ<<>> ఒప్పందాన్ని యూఎస్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. మిడిల్ ఈస్ట్‌లో బందీలను విడిపించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వారు విడుదల అవుతారని ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చెప్పారు. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Similar News

News January 16, 2025

తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి

image

AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.

News January 16, 2025

హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు

image

ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

News January 16, 2025

కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్

image

హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.