News March 28, 2025

ట్రంప్ కొరడా.. ఆరోగ్య శాఖలో 10వేల మందికి చెక్

image

ప్రభుత్వ శాఖల్లో ఖర్చును తగ్గించాలని నడుం బిగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఆరోగ్య శాఖపై కొరడా ఝుళిపించారు. ఆ శాఖలోని 10వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చర్యలు చేపట్టారు. ఎక్కువగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌లో 3,500మందిని తొలగించనున్నారు. ఈ నిర్ణయంతో ఏడాదికి 1.8బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.

Similar News

News March 31, 2025

బ్యాంకాక్‌లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం.. అందరూ మృతి!

image

భూకంపం ధాటికి బ్యాంకాక్‌లోని ఓ 33 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ శిథిలాల్లో చిక్కుకున్నవారందరూ మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. లోపల నుంచి దుర్గంధం వస్తుండటంతో ఎవరూ ప్రాణాలతో ఉండరని అంచనా వేస్తున్నారు. కాగా బ్యాంకాక్ వ్యాప్తంగా భూకంపం వచ్చినా ఇది ఒక్క బిల్డింగ్ మాత్రమే కుప్పకూలింది. దీంతో దీనిని నిర్మించిన చైనా ఇంజినీరింగ్ సంస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News March 31, 2025

మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు

image

AP: క్వార్ట్జ్ అక్రమాలు, పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. మంత్రితోపాటు ఆయన PA ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నోటీసుల ప్రకారం ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ DSP కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నట్లు వెల్లడించారు.

News March 31, 2025

SRH ఆరోపణలపై స్పందించిన HCA

image

SRH, HCA ప్రతిష్ఠను మసకబార్చేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని HCA మండిపడింది. SRH యాజమాన్యం నుంచి తమకు ఎలాంటి ఈమెయిల్స్ రాలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. కాగా ఉచిత పాస్‌ల కోసం HCA తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని SRH ఆరోపించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల విషయంపై HCA అధ్యక్షుడు జగన్ బెదిరించినట్లు సమాచారం.

error: Content is protected !!