News November 6, 2024
20 రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపు
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ యూఎస్ ఎన్నికల కౌంటింగ్‌లో దూసుకెళ్తున్నారు. 20 రాష్ట్రాల్లో ఆయన గెలుపొందారు. మిసిసిపీ, నార్త్ డకోటా, నెబ్రాస్కా, ఒహాయో, ఓక్లహామో, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, టెక్సాస్, మిస్సోరీలో విజయం సాధించారు. డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందారు. ఇల్లినోయీ, మసాచుసెట్స్, న్యూజెర్సీ, న్యూయార్క్‌లో గెలిచారు.
Similar News
News November 6, 2024
గెలిచేదెవరైనా US మరింత ఒంటరవ్వడం ఖాయం: జైశంకర్
ప్రెసిడెంట్‌గా గెలిచేదెవరైనా అమెరికా మరింత ఒంటరి (Isolationist) అవ్వడం ఖాయమేనని EAM జైశంకర్ అన్నారు. ఇతర దేశాలపై వారి పెత్తనం, రాజకీయ జోక్యం తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఒబామా హయాం నుంచి గ్లోబల్ కమిట్మెంట్స్ అంశంలో అమెరికా అప్రమత్తంగా ఉంటోందని వివరించారు. డొనాల్డ్ ట్రంప్ దీనిని బాహాటంగానే చెప్తుంటారని పేర్కొన్నారు. ఏదేమైనా అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
News November 6, 2024
BIG BREAKING: అల్లు అర్జున్‌కు ఊరట
AP: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. నంద్యాలలో ఆయనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలకు వెళ్లగా, అనుమతి లేని పర్యటన, కోడ్ ఉల్లంఘనల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని అల్లు అర్జున్ లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించి తీర్పిచ్చింది.
News November 6, 2024
పుంజుకున్న కమలా హారిస్.. తేడా 20 ఓట్లే
అమెరికా ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రత్యర్థితో పోలిస్తే కేవలం 20 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ 230, కమల 210తో నిలిచారు. ఒకానొక దశలో 100 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమెను కాలిఫోర్నియా, హవాయి, వర్జీనియా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వాషింగ్టన్ ఆదుకున్నాయి. నార్త్ కరోలినాను దక్కించుకోవడంతో వైట్‌హౌస్‌కు ట్రంప్ మార్గం సుగమమైందని తెలుస్తోంది.