News October 10, 2025
ట్రంప్‌కు ఈ ఏడాది నోబెల్ రానట్టే.. కారణమిదే!

NOBEL Peace Prize కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో యుద్ధాలు ఆపానని, అవార్డు తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు తగ్గట్టే ఆయన్ను పలు దేశాలు (పాకిస్థాన్, ఇజ్రాయెల్, కాంబోడియా) నామినేట్ చేశాయి. కానీ ఈసారి ఆయనకు నోబెల్ రానట్టేనని తెలుస్తోంది. FEB 1 లోగా ఆయన్ను నామినేట్ చేయాల్సి ఉండగా, ఆ లోగా ఒక్క దరఖాస్తూ రాకపోవడమే కారణం. దీంతో ఈ ఏడాదికి నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Similar News
News October 10, 2025
రూ.755 ప్రీమియంతో రూ.15లక్షలు బీమా!

ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. అందుకే ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే వారికి ఆర్థిక భరోసా లభిస్తుంది. పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షలు, రూ.399తో రూ.10లక్షల వరకు ప్రమాద <
News October 10, 2025
నోబెల్ అందుకున్న భారతీయులు వీరే..

నోబెల్ శాంతి-2025 <<17966688>>మరియాను<<>> వరించింది. ఇప్పటివరకు నోబెల్ అందుకున్న భారతీయులు ఎవరంటే..
* ఠాగూర్-లిటరేచర్(1913), * సీవీ రామన్-ఫిజిక్స్(1930), * హరగోవింద్ ఖొరానా-ఫిజియాలజీ(1968), * మథర్ తెరెసా-శాంతి(1979), * సుబ్రమణ్యన్ చంద్రశేఖర్-ఫిజిక్స్(1983), * అమర్త్యసేన్-ఎకనామిక్ సైన్స్(1998), * వెంకట్రామన్ రామకృష్ణన్-కెమిస్ట్రీ(2009), * కైలాశ్ సత్యార్థి-శాంతి(2014), * అభిజిత్ బెనర్జీ-ఎకనామిక్ సైన్స్(2019)
News October 10, 2025
4 లక్షల మందిని రేప్ చేసిన పాక్ ఆర్మీ!

1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైమ్‌లో పాక్ ఎన్నో అకృత్యాలకు పాల్పడిందని UN వేదికగా భారత్ సంచలన విషయాలు వెల్లడించింది. నాడు 4 లక్షల మంది బంగ్లా మహిళలను పాక్ దళాలు రేప్ చేసినట్లు చెప్పింది. ‘Op సెర్చ్ లైట్’ పేరుతో మారణహోమం చేసిన పాక్ సైన్యం ఓ ప్లాన్ ప్రకారం సామూహిక అత్యాచారాలకు దిగిందని తెలిపింది. భారత్‌కు లొంగిపోయే దాకా దారుణాలు కొనసాగాయని, తీవ్రమైన లైంగిక హింసగా చరిత్రలో ఇది నిలిచిందని పేర్కొంది.