News February 23, 2025
ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం: జైశంకర్

భారత ఎన్నికల్లో US నిధులను కేటాయించారన్న ట్రంప్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోంది. USAID నిధులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. పూర్తి విచారణ తర్వాతే దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.
Similar News
News December 11, 2025
చనిపోయిన సర్పంచి అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే?

TG: మరణించిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన బుచ్చిరెడ్డి ఈ నెల 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల్లో అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించారు. ఇవాళ జరిగిన పోలింగ్లో బుచ్చిరెడ్డికి 165 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి మరణించినా ఓటు వేయడం గమనార్హం.
News December 11, 2025
ఇంటికి ఒకే ద్వారం ఉండవచ్చా?

పెద్ద ఇంటికి ఒకే ద్వారం నియమం వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘గుడికి ఒకే ద్వారం ఉంటుంది. కిటికీలు ఉండవు. ఇల్లు కూడా అలాగే ఉండవచ్చు కదా? అని చాలామంది అనుకుంటారు. కానీ ఇళ్లు, ఆలయాలు ఒకటి కాదు. వాస్తు నియమాలు వేర్వేరుగా ఉంటాయి. ఇంట్లో మనుషులు నివసిస్తారు కాబట్టి రాకపోకలకు, గాలి, వెలుతురుకు ద్వారాలు, కిటికీలు తప్పనిసరి, చిన్న ఇంటికి ఓ ద్వారం ఉన్నా పర్లేదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 11, 2025
విత్తన బిల్లును వెనక్కు తీసుకోవాలి: KTR

TG: కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా ఉన్న విత్తన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని BRS నేత KTR డిమాండ్ చేశారు. ‘ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది. రైతులకు పరిహారం గ్యారంటీ లేదు. నకిలీ విత్తనాలకు కంపెనీలను కాకుండా అమ్మకందారులను బాధ్యుల్ని చేసేలా బిల్లు ఉంది. రాష్ట్ర అగ్రి శాఖల్లోని కీలక విత్తనాలు కేంద్ర ఆధిపత్యంలోకి వెళ్తాయి’ అని పేర్కొన్నారు.


