News April 4, 2025
ట్రంప్ కామెంట్స్.. భారీగా పడిపోయిన ఫార్మా షేర్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు భారతీయ ఫార్మా షేర్లు భారీగా పడిపోతున్నాయి. త్వరలోనే ఫార్మా రంగంపై సుంకాలు మునుపెన్నడూ లేని విధంగా ఉంటాయని మీడియాతో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫార్మాను ప్రత్యేక కేటగిరీగా చూస్తున్నామని, త్వరలో టారిఫ్స్ విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో అరబిందో ఫార్మా, IPCA లేబరేటరీస్, లుపిన్, ఇతర డ్రగ్ మేకర్స్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి.
Similar News
News April 10, 2025
రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
News April 10, 2025
కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.
News April 10, 2025
KOHLI: మరో 2 బౌండరీలు బాదితే చరిత్రే

స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. మరో 2 బౌండరీలు బాదితే IPLలో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలవనున్నారు. ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదారు. ఆ తర్వాతి స్థానంలో ధవన్(920), డేవిడ్ వార్నర్(899), రోహిత్ శర్మ(885) ఉన్నారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా? అనేది కాసేపట్లో తేలనుంది.