News November 27, 2024

ట్రంప్ నిర్ణయం.. వీటి ధరలు పెరిగే ఛాన్స్?

image

మెక్సికో, కెనడా వస్తువులపై 25% పన్ను విధిస్తానన్న ట్రంప్ <<14711264>>ప్రకటనతో<<>> US ప్రజల్లో ఆందోళన మొదలైంది. అమెరికా.. కెనడా నుంచి గ్యాస్, మెక్సికో నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, కార్లు, ఆల్కహాల్ అధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు పన్నుభారం పడి వాటి ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది దేశ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని US ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 10, 2026

బడ్ చిప్ పద్ధతిలో చెరకు సాగుతో అధిక లాభం

image

తెలుగు రాష్ట్రాల్లో చెరకు ప్రధాన వాణిజ్య పంటగా లక్షల ఎకరాల్లో సాగవుతోంది. సాగు ఖర్చులు పెరగడం, కూలీల కొరత వల్ల క్రమంగా ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ తరుణంలో చెరకులో సాగు ఖర్చులు తగ్గి, అధిక దిగుబడులు పొందడానికి కను చిప్పల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీని సాయంతో నాణ్యమైన చెరకు నారు పెంచి, ప్రధాన పొలంలోని వరుసల్లో నాటినట్లయితే నికర ఆదాయం పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది.

News January 10, 2026

చైనా, బంగ్లా ముప్పు.. బెంగాల్‌లో మన నేవీ బేస్!

image

చైనా, బంగ్లాదేశ్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈశాన్యంలో రక్షణను ఇండియా కట్టుదిట్టం చేస్తోంది. బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నేవీ బేస్‌ను ఏర్పాటు చేయనుంది. 100 మంది ఆఫీసర్లు, సెయిలర్లను నియమించడంతోపాటు ఒక జెట్టీని, ఇతర ఫెసిలిటీస్‌ను నిర్మించనుంది. ఫాస్ట్ ఇంటర్‌సెప్టార్ క్రాఫ్ట్స్, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ వంటి చిన్న వార్ షిప్స్‌ను అక్కడ మోహరించనుంది. దీంతో అక్కడ నిఘా, రక్షణ పెరగనుంది.

News January 10, 2026

రివ్యూ ఆప్షన్ నిలిపివేత.. కారణం ఇదే

image

సినిమా రివ్యూల పేరిట జరుగుతున్న ‘డిజిటల్ మాఫియా’కు అడ్డుకట్ట వేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కొందరు కావాలనే సినిమాలను టార్గెట్ చేస్తూ ఇచ్చే తప్పుడు రివ్యూలు, నెగటివ్ రేటింగ్స్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూ ఆప్షన్‌ను నిలిపివేశారు.