News September 20, 2025
ట్రంప్ నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం: శ్రీధర్ బాబు

TG: H1B వీసా ఛార్జీలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ‘మన రాష్ట్రం నుంచి అమెరికాకు చాలామంది వెళ్లారు. ఇక్కడ కుటుంబాలు వాళ్లు పంపించే మనీ పైనే ఆధారపడుతున్నాయి. TCSలో లక్ష మంది, విప్రోలో 80 వేలు, ఇన్ఫోసిస్‌లో 60 వేల మంది USలో పనిచేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంపై PM మోదీ మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేంటి. USతో కేంద్రం చర్చలు జరపాలి’ అని కోరారు.
Similar News
News September 20, 2025
స్థానిక ఎన్నికలపై CM కీలక భేటీ

TG: స్థానిక ఎన్నికలు SEP30లోపు పూర్తవాలన్న HC తీర్పును ప్రభుత్వం వచ్చేవారం అప్పీల్ చేయనుంది. కొందరు మంత్రులు, న్యాయ నిపుణులతో CM దీనిపై ఇవాళ చర్చించారని సచివాలయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. BC రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం, గవర్నర్ వద్ద బిల్లుల పెండింగ్, వానలు, పండగల సెలవులు తదితరాలు ఆలస్యానికి కారణాలుగా HCకి తెలపాలని నిర్ణయించారట. కాగా, ఇది ఇప్పుడే బయటకు చెప్పొద్దని భేటీలో రేవంత్ హెచ్చరించారు.
News September 20, 2025
భారత్ ఓటమి

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. 413 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాకు స్మృతి మంధాన(125) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. హర్మన్ ప్రీత్(52), దీప్తి శర్మ(72) అర్ధశతకాలతో రాణించినా.. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో విజయానికి 43 పరుగుల దూరంలో ఆలౌటైంది. దీంతో 1-2తో భారత్ సిరీస్ కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటారు.
News September 20, 2025
ఇడ్లీ, దోశపై GST.. ప్రచారాస్త్రం కానుందా..?

కేంద్రం తాజా GST మార్పుల్లో ఇడ్లీ, దోశలను 5% శ్లాబులోనే ఉంచడం విమర్శలకు దారితీస్తోంది. ఉత్తరాదిన ఎక్కువ తినే రోటీలను 0% పన్నులోకి తీసుకొచ్చి సౌత్‌లో పాపులర్ టిఫిన్ల ట్యాక్స్ మార్చలేదు. అసలే ఉత్తరాది, హిందీ ఆధిపత్య అంశాలు తరచూ ప్రస్తావనకు వచ్చే తమిళనాట రానున్న వేసవిలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. అక్కడి పార్టీలకు ఈ పన్ను BJPపై ప్రచారాస్త్రంగా మారవచ్చని విశ్లేషకుల అంచనా. టిఫిన్ ట్యాక్స్‌పై మీ కామెంట్?