News September 20, 2025

ట్రంప్ నిర్ణయంతో భారతీయుల ఉద్యోగాలు పోతాయ్: కాంగ్రెస్

image

US H-1B వీసా ఫీజులు పెంచడంతో భారత్ చాలా నష్టపోతుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘మోదీ ఫ్రెండ్ ట్రంప్ ₹6లక్షలుగా ఉన్న H-1B వీసా ఫీజును ₹88లక్షలకు పెంచారు. దీని వల్ల ఇండియన్స్‌కు USలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. అక్కడి నుంచి INDకు వచ్చే మనీ తగ్గుతుంది. ఇక్కడి IT ఉద్యోగుల జాబ్స్ రిస్క్‌లో పడతాయి. మోదీ ఫెయిల్డ్ ఫారిన్ పాలసీ పరిణామాలను దేశం ఇప్పుడు అనుభవిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది’ అని పేర్కొంది.

Similar News

News September 20, 2025

ఐఫోన్-17 నాణ్యతపై విమర్శలు!

image

యాపిల్ నుంచి ఐఫోన్-17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే, గత సిరీస్‌లతో పోల్చితే 17 మోడల్స్‌లో నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలొస్తున్నాయి. దీనివల్ల ఫోన్‌పై గీతలు పడటం, దెబ్బ తినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ -17 ఫ్రేమ్‌కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది.

News September 20, 2025

ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. విమాన సర్వీసులపై ఎఫెక్ట్

image

యూరప్‌లోని పలు ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రస్సెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. <<17769573>>రేపటిలోగా<<>> US వెళ్లాల్సిన H1B వీసాదారుల్లో ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మనదేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

News September 20, 2025

రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది: రామ్‌చందర్

image

TG: CM రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రాష్ట్ర BJP చీఫ్ రామ్‌చందర్ ఎద్దేవా చేశారు. ‘కిషన్‌రెడ్డిని నిందించడం రేవంత్‌ మానుకోవాలి. ఆయనకు ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది. కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ CBI దగ్గర ఉంది’ అని అన్నారు. ఆపరేషన్ కగార్‌పై మాట్లాడుతూ ‘మావోలతో చర్చల అంశం కేంద్రం చూసుకుంటుంది. వారితో అనేకసార్లు చర్చలు జరిగినా హింస పెరిగిందే కానీ తగ్గలేదు’ అని చెప్పారు.