News December 11, 2024

ట్రంప్‌కు కాబోయే కోడలికి కీలక పదవి

image

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫియాన్సీ కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్‌కు US రాయబారిగా నియమించారు. కింబర్లీ గతంలో ఫాక్స్ న్యూస్ హోస్ట్‌గా పనిచేశారు. 2020లో ట్రంప్ జూనియర్‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా జూనియర్ ట్రంప్‌ ఇప్పటికే వానెసాతో పెళ్లై విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు.

Similar News

News November 17, 2025

కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకురావొచ్చా?

image

కాశీని మనం మోక్ష నగరంగా పరిగణిస్తాం. ఇక్కడ ఉండే మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో నిత్యం దహన సంస్కారాలు జరుగుతుంటాయి. అక్కడ మోక్షం పొందిన ఆత్మల శక్తి గంగాజలంలో ఉంటుందని పండితులు అంటారు. ఆ శక్తిని ఇంటికి తీసుకురావడం అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొచ్చి, ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని నమ్మకం. అయితే హరిద్వార్, రిషికేశ్ వంటి ఇతర పవిత్ర నగరాల నుంచి గంగాజలం తేవడం శ్రేయస్కరం.

News November 17, 2025

‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

image

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.

News November 17, 2025

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

image

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్‌కు తెలుస్తుందని తెలిపారు. సూరత్‌లోని రైల్వే కారిడార్‌లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.