News November 28, 2024
ఆ దేశం నుంచి భారతీయులను అడ్డుకోవడమే ట్రంప్ లక్ష్యం?

USలోకి అక్రమ వలసలను నివారించే వరకు మెక్సికో, కెనడా దేశాలపై ట్రంప్ పన్నుల మోత మోగించనున్నారు. ముఖ్యంగా కెనడా నుంచి వలసలు అధికమవుతున్నాయని, అందులోనూ భారతీయులు అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది గంటకు 10 మంది భారతీయులు యూఎస్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. కెనడా నుంచి USలోకి వెళ్లే అక్రమ వలసదారుల్లో 60% భారతీయులే ఉండడం గమనార్హం.
Similar News
News January 29, 2026
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News January 29, 2026
మరణించిన వ్యక్తి కలలో వచ్చారా?

మరణించిన వ్యక్తులు కలలో కనిపించడం అశుభం కాదు. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఇది మనసులోని బలమైన జ్ఞాపకాలకు, వారిపై ఉన్న ప్రేమకు ప్రతిబింబం. మృతులు కలలో కనిపించడం అంటే మీ జీవితంలో ఓ దశ ముగిసి, కొత్త మార్పులు మొదలవుతున్నాయని అర్థం. కొన్నిసార్లు వారు మనల్ని మార్గదర్శనం చేయడానికి కూడా రావచ్చు. మనసులో ఒత్తిడి, అసంపూర్తి కోరికల వల్ల కూడా ఇలాంటి కలలు వస్తాయి. ఆందోళన చెందక, మానసిక సంకేతంగా చూడటం మంచిది.
News January 29, 2026
చైనాలో 11 మందికి మరణశిక్ష అమలు

క్రూరమైన మింగ్ మాఫియా ఫ్యామిలీకి చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను తాజాగా అమలు చేశారు. హత్యానేరం, అక్రమ నిర్బంధం, గ్యాంబ్లింగ్ వంటి 14 రకాల నేరాల్లో వీరు దోషులుగా తేలడంతో సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వీరికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా వీళ్లు సుమారు $1.4 బిలియన్ల ఆన్‌లైన్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.


