News October 11, 2025

ట్రంప్‌ది ఉరకలేసే హృదయం

image

అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. రెండోసారి బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 79 ఏళ్లు. కానీ ఆయన హృదయం మాత్రం 14 ఏళ్ల చిన్నదేనట. ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను వైట్‌హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు. ఆయన గుండె, శరీరం వాస్తవ వయసుకన్నా తక్కువ ఉన్నట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలిందన్నారు. ఊపిరితిత్తులు, నాడులు, ఇతర అవయవాల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు చెప్పారు.

Similar News

News October 11, 2025

తాజా న్యూస్ రౌండప్

image

✒ ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
✒ AP: నెల్లూరు జిల్లా మైపాడు గేటులో స్మార్ట్ స్ట్రీట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
✒ చిత్తూరు నకిలీ మద్యం తయారీ.. నిందితులకు సీఎం, మంత్రి లోకేశ్‌తో సంబంధాలు: మాజీ మంత్రి కాకాణి
✒ వరంగల్ టెక్స్ టైల్ పార్కులో టీషర్టుల ఉత్పత్తిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం
✒ హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేయాలన్న సాయి తేజ్.. ఆటో ఎక్స్పో 2015లో మెరిసిన మెగా హీరో

News October 11, 2025

ఏపీకి ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

image

AP: ప్రధాని మోదీ ఈనెల 16న 7.50AMకు ఢిల్లీ నుంచి బయల్దేరి 10.20AMకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.10AMకు రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి 11.45AMకు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. 2.30PMకు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు శంకుస్థాపన చేస్తారు. 4PMకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4.40PMకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

News October 11, 2025

విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

image

AP: విజయవాడ, సింగపూర్ మధ్య నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాల్లో) సర్వీసులు ఉంటాయని వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ఈ సర్వీసులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.