News January 20, 2025
నేడు ట్రంప్ ప్రమాణ స్వీకారం

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వాషింగ్టన్ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత ప్రభుత్వం నుండి విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
Similar News
News December 6, 2025
బుమ్రాను ఉపయోగించుకోవడానికి బ్రెయిన్ కావాలి: రవిశాస్త్రి

SAతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియా బౌలింగ్‌లో ఫెయిల్ అవుతున్న వేళ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్‌పై మాజీ కోచ్ రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “బుమ్రా గ్రేట్ బౌలర్. అతడిని ఉపయోగించుకోవడానికి బ్రెయిన్ కావాలి” అంటూ జట్టు మేనేజ్‌మెంట్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. కాగా ఇంగ్లండ్ టూర్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా.. ప్రస్తుతం జరుగుతున్న వన్డేల నుంచి రెస్ట్‌లో ఉన్నారు.
News December 6, 2025
గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలి: పవన్

AP: అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.
News December 6, 2025
మొబైల్ రీఛార్జ్ ధరలపై యూజర్ల ఆగ్రహం!

కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు. గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు.


