News April 12, 2025
ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం

ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు అమెరికాలో ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు. వీటిని పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్ ధరలపై అదనపు సుంకం భారం ఉండదు.
Similar News
News April 13, 2025
ఆ హీరోతో హీరోయిన్ అనుపమ డేటింగ్?

తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పాటిఫైలో వీరిద్దరి పేరిట ‘బ్లూ మూన్’ అనే ప్లే లిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బిసన్’ అనే సినిమా చేస్తున్నారు. దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News April 13, 2025
కీవ్‌లోని భారతదేశ ఫార్మా గౌడౌన్‌పై రష్యా దాడులు: ఉక్రెయిన్

తమ దేశంలోని కీవ్‌లో ఉన్న భారత్‌కు చెందిన ఓ ఫార్మా గోడౌన్‌పై రష్యా క్షిపణి దాడి చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. భారత్‌తో మైత్రి ఉందని చెబుతూనే ఉద్దేశపూర్వకంగా ఆ దేశ వ్యాపారాలను మాస్కో టార్గెట్ చేస్తోందని INDలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ దాడితో పిల్లలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన మందులు నాశనం అయినట్లు వివరించింది. కాగా, ఉక్రెయిన్ ఆరోపణలపై భారత్, రష్యా ప్రభుత్వాలు ఇంకా స్పందించలేదు.
News April 13, 2025
ALERT: నేడు 30 మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: ఇవాళ రాష్ట్రంలోని 30 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. అలాగే 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. శ్రీకాకుళం-7, విజయనగరం-11, మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలంది. స్థానిక వాతావరణం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడాలని సూచించింది.