News December 3, 2024

ట్రంప్ ‘ఉక్కు’ సంకల్పం భారత్‌కు ఆందోళనకరం

image

స్టీల్ దిగుమతులపై టారిఫ్స్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలివ్వడం భారత్‌ను భయపెడుతోంది. ప్రస్తుతం దేశీయ స్టీల్ దిగుమతులు 41% పెరగ్గా ఎగుమతులు 36% తగ్గాయి. స్టీల్ నిల్వలు 15 నుంచి 30 రోజులకు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గడంతో లాభాలు తగ్గాయని కంపెనీలు అంటున్నాయి. దీంతో టారిఫ్స్ నుంచి కాపాడేందుకు 25% సేఫ్‌గార్డ్ డ్యూటీ విధించాలని కోరుతున్నాయి. 2024-25 H1లో స్టీల్ వినియోగం 13% పెరిగింది.

Similar News

News September 18, 2025

మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్‌పై విమర్శలు

image

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్‌కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.

News September 18, 2025

అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

image

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

News September 18, 2025

రాష్ట్రంలో 21 పోస్టులు

image

<>ఏపీపీఎస్సీ<<>> 21 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో డ్రాట్స్‌మెన్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, హార్టికల్చర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్(లైబ్రరీ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.370. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.