News November 3, 2024
ట్రంప్ విజయం ఖాయం: Rasmussen Poll

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll అంచనా వేసింది. ట్రంప్కు 297, కమలా హారిస్కు 241 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినా, విస్కన్సిన్, నెవడా, పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ సత్తా చాటుతారని తెలిపింది. కాగా నవంబర్ 5న అగ్రరాజ్యంలో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 22, 2025
peace deal: ఉక్రెయిన్ను బెదిరించి ఒప్పిస్తున్న అమెరికా!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి 28 పాయింట్లతో కూడిన <<18346240>>పీస్ ప్లాన్<<>>ను అందజేసింది. అయితే దీన్ని అంగీకరించాలని ఉక్రెయిన్పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే నిఘా సమాచారం, ఆయుధాల సరఫరాలను తగ్గిస్తామని బెదిరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే గురువారం లోగా ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పినట్లు తెలిపాయి.
News November 22, 2025
Photo: మెరిసిపోతున్న ఢిల్లీని చూశారా?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన అద్భుత ఫొటోలను నాసా SMలో షేర్ చేసింది. ఢిల్లీ, టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలు రాత్రి పూట వెలిగిపోతున్నాయి. ఇవి స్పేస్ నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన అర్బన్ సెంటర్లు అని నాసా క్యాప్షన్ ఇచ్చింది. వాటిలో ఢిల్లీ వ్యూ మాత్రం కళ్లుచెదిరేలా ఉంది. సిటీని విభజిస్తున్న యమునా నది, విద్యుత్ దీపాల వెలుగుల్లో సీతాకోకచిలుకలా అందంగా కనిపిస్తోంది.
News November 22, 2025
రెండో టెస్ట్: సమర్పిస్తారా? సమం చేస్తారా?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. గువాహటి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్కు గిల్ దూరం కాగా, రిషభ్ పంత్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తొలి టెస్టు మాదిరే ఇందులోనూ గెలవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ ప్రొటీస్ సొంతం కానుంది. మరోవైపు ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఉ.9.00 మ్యాచ్ ప్రారంభం కానుంది.


