News March 7, 2025
పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక

రష్యా పట్ల సానుకూల వైఖరితో ఉన్న ట్రంప్ ఒక్కసారిగా ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై దాడులు ముమ్మరం చేయడంతో ఆగ్రహించిన ట్రంప్ అధిక మొత్తంలో సుంకాలు విధిస్తామని పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే బ్యాంకింగ్లోనూ కొత్తగా ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే వరకు అధిక సుంకాల విధింపు ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News December 8, 2025
బరువు తగ్గాలంటే వీటిని ట్రై చేయండి!

బరువు తగ్గాలనుకునేవారికి డ్రైఫ్రూట్స్ సాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘బాదం తీసుకుంటే వాటిలోని ఫైబర్, కొవ్వుల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆక్రోట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి తగ్గుతుంది. భోజనానికి ముందు గుప్పెడు పల్లీలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఖర్జూరాల వల్ల అధిక శక్తి అంది త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.
News December 8, 2025
TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
News December 8, 2025
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్‌సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్‌షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.


