News August 14, 2025

పుతిన్‌కు ట్రంప్ హెచ్చరికలు

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 15న అలస్కా వేదికగా జరగనున్న సమావేశం తర్వాత ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలా రాని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ భేటీ ఊహించిన విధంగా కొనసాగితే.. తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో కలిసి మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.

Similar News

News August 14, 2025

నేడు బలరామ జయంతి.. ఎలా పూజించాలంటే?

image

శ్రావణ బహుళ షష్ఠి(నేడు) రోజున బలరామ జయంతిని జరుపుకుంటారు. ఉ.8గం.-ఉ.11గం. వరకు పూజకు మంచిదని పండితులు తెలిపారు. ఈరోజు బలరాముని పూజిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసం. ‘సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి బలరామకృష్ణుల పటాలకు గంధం, కుంకుమ పెట్టుకోవాలి. పారిజాత పూలు, శంఖు, పొగడ పూలతో పూజించాలి. పాలు, వెన్న, మీగడ, అటుకులు వంటి పదార్థాలతో నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం ఉండాలి’ అని చెబుతున్నారు.

News August 14, 2025

మినిమం బ్యాలెన్స్‌‌ను భారీగా పెంచిన HDFC

image

అర్బన్ ఏరియాల్లో నెలవారీ మినిమం బ్యాలెన్స్‌ను రూ.25వేలకు పెంచుతున్నట్లు HDFC ప్రకటించింది. గతంలో ఇది రూ.10వేలుగా ఉండేది. AUG 1 తర్వాత సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వారికి ఇది వర్తిస్తుంది. సెమీ అర్బన్ ఏరియాల్లోనూ రూ.25వేలుగా(గతంలో రూ.5వేలు) నిర్ధారించింది. రూరల్ ప్రాంతాల్లో రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచింది. ఇటీవల ICICI కూడా భారీగా మినిమం బ్యాలెన్స్‌ను పెంచగా తీవ్ర విమర్శలు రావడంతో <<17396156>>వెనక్కి<<>> తగ్గింది.

News August 14, 2025

జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదు అయ్యిందంటే?

image

AP: నిన్న కురిసిన భారీ వర్షాలకు అత్యధికంగా బాపట్ల జిల్లా చుండూరు మం.లో 27.24 సెం.మీ., గుంటూరు జిల్లా చేబ్రోలులో 23.4, దుగ్గిరాలలో 22.58, తాడికొండలో 22.50, మంగళగిరిలో 19.48, నాగాయలంకలో 19.1, పెదకాకానిలో 18.68, తుళ్లూరులో 18.02, తెనాలిలో 17.84, కోనసీమ జిల్లా డి.ముమ్మిడివరంలో 18.8, ఏలూరు జిల్లా నిడమర్రులో 14.3, NTR జిల్లా నందిగామలో 13.3, ప.గో.జిల్లా తాడేపల్లిగూడెంలో 11.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.