News June 17, 2024

గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి.. UPSCకి 50మంది దూరం!

image

మహారాష్ట్రలోని సమర్థ్‌నగర్‌లో ఉన్న స్వామి వివేకానంద కాలేజీలో UPSC ఎగ్జామ్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్ వడగావ్ కోహ్లటీలో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించింది. మ్యాప్స్‌పై ఆధారపడ్డ 50మందికి పైగా అభ్యర్థులు మొదట వడగావ్ కోహ్లటీకి వెళ్లారు. తప్పుడు సెంటర్‌‌కి వచ్చామని గ్రహించి సమర్థ్‌నగర్‌కి చేరుకునే ప్రయత్నం చేసినా అప్పటికే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసేశారు. దీంతో వారంతా పరీక్షకు దూరమయ్యారు.

Similar News

News February 2, 2025

కంటి చూపును తిరిగి రప్పించే ఔషధం!

image

కంటి నరాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ కవచం దెబ్బతిన్నప్పుడు కంటిచూపు మందగిస్తుంది. అలా కోల్పోయే వారి చూపును మెరుగుపరిచే సామర్థ్యమున్న ఔషధాన్ని అమెరికాలోని కొలరాడో పరిశోధకులు అభివృద్ధి చేశారు. LL341070గా పిలుస్తున్న ఈ ఔషధం మైలిన్ మరమ్మతు విషయంలో శరీరానికి సాయంగా నిలుస్తుందని వారు వివరించారు. అయితే ప్రస్తుతం పరిశోధన స్థాయిలో ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ఔషధాన్ని తీసుకొస్తామని వారు చెప్పారు.

News February 2, 2025

అలా జరగకపోతే పేరు మార్చుకుంటా: డైరెక్టర్

image

‘తండేల్’ డైరెక్టర్ చందూ మొండేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్‌గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.

News February 2, 2025

కంగ్రాట్స్ టీమ్ ఇండియా: సీఎం చంద్రబాబు

image

U-19 T20 ప్రపంచకప్ గెలుచుకున్న భారత అమ్మాయిల్ని AP CM చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, YSRCP అధినేత YS జగన్ అభినందించారు. ‘మీ కష్టం, సంకల్పంతో సౌతాఫ్రికాపై ఘనవిజయం సాధించి భారతీయుల్ని గర్వించేలా చేశారు’ అని చంద్రబాబు, ‘దేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేశారు. తెలుగువారికి త్రిష గర్వకారణం’ అని లోకేశ్ కొనియాడారు. జట్టు భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని మాజీ CM జగన్ ఆకాంక్షించారు.