News May 25, 2024
గూగుల్ తల్లిని నమ్మి.. నేరుగా కాల్వలోకి..!

కొత్త చోట్లకు వెళ్లినప్పుడు గూగుల్ మ్యాప్‌ను వాడటం పరిపాటే. అలా వాడటమే హైదరాబాద్‌కు చెందిన నలుగురి ‘కారు’ముంచింది. కేరళలోని అలప్పుళకు వారు టూర్ వెళ్లారు. ఆ సమయానికి భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్డుపై వరద కనిపిస్తున్నా గూగుల్‌పై నమ్మకంతో వారు ముందుకే వెళ్లారు. ఈ క్రమంలో వరద నీటి నుంచి కాల్వలోకి వెళ్లిపోయారు. అదృష్టవశాత్తూ అందరూ బయటపడ్డారు కానీ కారు నీట మునిగింది.
Similar News
News December 29, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 29, 2025
‘OP సిందూర్’లో మా ఎయిర్‌బేస్‌పై దాడి జరిగింది: పాక్ Dy PM

ఆపరేషన్ సిందూర్ సమయంలో నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందని పాక్ Dy PM ఇషాక్ దార్ ఒప్పుకున్నారు. కానీ ఇండియా దాడిని సమర్థంగా అడ్డుకున్నట్లు గొప్పలకుపోయారు. ‘వాళ్లు(ఇండియా) మా పైకి 36 గంటల్లో 80 డ్రోన్లు పంపారు. మేం 79 ఇంటర్సెప్ట్ చేశాం. ఒకటి మాత్రం మా సైనిక స్థావరాన్ని డ్యామేజ్ చేసింది. మే 10న నూర్ ఖాన్ బేస్‌పై దాడితో ఇండియా తప్పు చేసింది. దీంతో పాక్ ప్రతీకార చర్యకు దిగింది’ అని చెప్పారు.
News December 29, 2025
వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు: సుదీప్

మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదని హీరో కిచ్చా సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర పలు భాషల్లో అతిథి పాత్రలు చేశాం. నేను కొన్నిసార్లు డబ్బులే తీసుకోలేదు. కానీ ఆయా భాషల నటులు కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేను వ్యక్తిగతంగా కొందరు యాక్టర్స్‌ను అడిగినా నటించలేదు’ అని ‘మార్క్’ సినిమా ప్రమోషన్లలో ఆయన వాపోయారు.


