News July 17, 2024
సత్యమే గెలుస్తుంది: కేటీఆర్

TG: అధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని మాజీ మంత్రి KTR అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. ‘రాజకీయ ప్రతీకారాలకు పరిమితులు ఉంటాయి. బాధితులను ఎక్కువ కాలం బాధించొద్దని సుప్రీం తీర్పు చెబుతోంది. KCR కేసులో అధికార దుర్వినియోగం చేశారని న్యాయస్థానం పేర్కొంది. సత్యమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. NZతో తొలి వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ సాధించారు. సచిన్ 34,357 (782 ఇన్నింగ్సులు) పరుగులతో తొలి స్థానంలో ఉండగా, కోహ్లీ 28,027* (624 ఇన్నింగ్సులు) రన్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత వేగంగా 28వేలకు పైగా రన్స్ (సచిన్ 644 ఇన్నింగ్సులు) చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచారు.
News January 11, 2026
ఇక కేరళ వంతు.. BJP పవర్‌లోకి వస్తుంది: అమిత్ షా

2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో BJP అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘2014లో 11% ఓట్లు వస్తే 2024లో 20%కి పెరిగాయి. త్వరలో 40% సాధిస్తాం. కేరళ వంతు వచ్చింది. ఇక్కడ కచ్చితంగా బీజేపీ సీఎం ఎన్నికవుతారు’ అని చెప్పారు. కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీజేపీ-ఎన్డీయే అధికారంలోకి వచ్చిన ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు.
News January 11, 2026
దేశంపై నమ్మకం ఉంచండి: పీయూష్ గోయల్

భారత్‌తో ట్రేడ్ డీల్ ఆలస్యం కావడానికి మోదీ ఫోన్ <<18809902>>చేయకపోవడమే<<>> కారణమని US వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. దేశంపై నమ్మకం ఉంచాలని ప్రజలను కోరారు. ‘మీ దేశాన్ని, మాతృభూమిని విశ్వసించండి. విదేశీయుల ప్రకటనలను కాదు. ట్రేడ్ డీల్ చిక్కుల గురించి మీడియా ముందు మాట్లాడుకోరు. రహస్యంగానే చర్చిస్తారు’ అని ఆయన స్పష్టం చేశారు.


