News May 1, 2024

ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్

image

తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక జనతాదళ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ స్పందించారు. ‘నేను బెంగళూరులో లేనందున సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నాను. నాకు వారం సమయం కావాలి. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తా. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది’ అని తెలిపారు. కాగా, ఉద్యోగాల కోసం వచ్చిన మహిళలు, యువతులను ప్రజ్వల్ లైంగికంగా వేధించారని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

Similar News

News December 25, 2024

కుటుంబ సభ్యులతో YS జగన్(PHOTO)

image

AP: YS జగన్ కడప జిల్లా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇడుపులపాయలోని YSR ఎస్టేట్‌లో తన బంధువులు, కుటుంబ సభ్యులతో జగన్ సరదాగా ఓ ఫొటో దిగారు. ఇందులో జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు సోదరులు YS అనిల్, సునీల్, అవినాశ్ రెడ్డి, కుమార్తెలు వర్ష, హర్ష సహా తదితరులు ఉన్నారు. దీంతో ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి.

News December 24, 2024

మణిపుర్‌కు కొత్త గవర్నర్.. కేంద్రం వ్యూహం ఇదేనా?

image

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో ప‌రిస్థితుల్ని చ‌క్క‌దిద్దేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రానికి కొత్త‌ గ‌వ‌ర్న‌ర్‌గా అజ‌య్ కుమార్ భ‌ల్లాను నియ‌మించింది. గ‌తంలో కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన ఆయ‌న్ను అనూహ్యంగా తెర‌మీద‌కు తేవ‌డం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. శాంతి భ‌ద్ర‌త‌ల అంశాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉన్న కార‌ణంగానే కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

News December 24, 2024

జనవరి 1న శ్రీశైలం వెళ్తున్నారా?

image

AP: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో జనవరి 1న స్పర్శదర్శనాలు, ఆర్జిత అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. న్యూఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఉదయాస్తమాన, ప్రాతఃకాల, ప్రదోషకాల సేవలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని వెల్లడించారు.