News July 26, 2024
ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక నిజాలు బయటకొస్తాయి: సిసోదియా

AP: మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో రికార్డుల దహనం కేసులో కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడుతుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోదియా తెలిపారు. ‘YCP నేత మాధవరెడ్డి పరారయ్యారు. ఏడుగురిని విచారిస్తున్నాం. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక నిజాలు తెలుస్తాయి. రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీహోల్డ్ అవుతాయనే ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం’ అని చెప్పారు.
Similar News
News March 28, 2026
యుద్ధ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాం: మోదీ

పశ్చిమాసియాలో యుద్ధంతో అనేక దేశాల్లో ఆహారం, ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని PM మోదీ తెలిపారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పౌరులంతా ఐక్యంగా, ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. భయాందోళనలు రేకిత్తించే తప్పుడు ప్రచారాలు చేయొద్దని పార్టీలకు హితవు పలికారు. నోయిడా(UP)లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తొలి దశను ఆయన ప్రారంభించారు.
News March 28, 2026
గంభీర్ ఫొటోలు వాడొద్దు: హైకోర్టు

టీమ్‌ఇండియా కోచ్ గంభీర్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఫొటో, వాయిస్‌తో రూపొందించిన ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ కంటెంట్‌ను 36 గంటల్లోగా తొలగించాలని ఇన్‌స్టా, గూగుల్ సహా ఇతర SM ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. ఈ కంటెంట్‌ను క్రియేట్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని పేర్కొంది. అనుమతి లేకుండా వీడియోలు చేయడం వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
News March 28, 2026
TN ఎన్నికల బరిలో నటుడు సుందర్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్టర్, నటుడు సుందర్ తొలిసారి పోటీ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పుతియ నీతి కట్చి(న్యూ జస్టిస్ పార్టీ) అభ్యర్థిగా మధురై సెంట్రల్ నుంచి బరిలో దిగనున్నారు. తన భర్తకు సపోర్ట్ చేయాలని బీజేపీ నేత, నటి ఖుష్బూ అభిమానులు, స్నేహితులను కోరారు. 30 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రజలకు సేవ చేయడమే సుందర్ లక్ష్యమని తెలిపారు.
<<-se>>#ELECTIONS2026<<>>


