News April 13, 2024

అభ్యర్థులకు TSPSC అలర్ట్

image

TG: గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్‌లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈనెల 20న ఉ.10:30 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. అభ్యర్థుల లిస్టును <>వెబ్‌సైట్‌లో<<>> పొందుపరిచినట్లు TSPSC పేర్కొంది. అలాగే పలు ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో ఏఈఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 15 నుంచి 22 వరకు ఉస్మానియా ఆస్పత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

Similar News

News January 17, 2026

ఏపీ నుంచి వచ్చే వాహనాల దారి మళ్లింపు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో AP నుంచి HYDకు వాహనాల రద్దీ పెరిగింది. NH-65 విస్తరణ పనుల దృష్ట్యా అధికారులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గుంటూరు నుంచి HYD వచ్చే వెహికల్స్‌ను మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి-మాల్, మాచర్ల-సాగర్-పెద్దవూర-చింతపల్లి-మాల్ మీదుగా, విజయవాడ నుంచి వచ్చే వాటిని కోదాడ-మాల్ నుంచి HYDకు పంపిస్తున్నారు. NH-65పై ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా దారి మళ్లించనున్నారు.

News January 17, 2026

ఎయిర్ ‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్ ‌పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్ కంపెనీ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, ICWA అర్హతతో పాటు పని అనుభవం గల వారు FEB 15వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60K, మేనేజర్ పోస్టుకు రూ.70K చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.aai.aero

News January 17, 2026

రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: KTR

image

TG: సీఎం రేవంత్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని KTR విమర్శించారు. ‘సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. SEC కార్పొరేషన్ సాధనకు ర్యాలీ నిర్వహించాలనుకుంటే మా నేతలను నిర్బంధించారు. కోర్టు ద్వారా అనుమతి తీసుకొని ర్యాలీ చేస్తాం. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం’ అని అన్నారు. అటు SECకు చెందిన నార్త్ జోన్ ప్రాంతాలను మల్కాజిగిరి పరిధిలో కలపడం అన్యాయమని BRS ఆరోపిస్తోంది.