News May 3, 2024
గ్రూప్-3 పోస్టులపై TSPSC కీలక అప్డేట్

TG: మహిళలకు సమాంతర రిజర్వేషన్‌లు అమలు చేస్తున్నందున గ్రూప్-3 నోటిఫికేషన్‌లో ఖాళీల రివైజ్డ్ బ్రేకప్‌ను TSPSC ఇవాళ ప్రకటించింది. అన్ని విభాగాలు, పోస్టులను రిజర్వ్ కేటగిరీల వారీగా వెల్లడించింది. పూర్తి వివరాల PDFను <
Similar News
News March 12, 2026
నిరుద్యోగులకు అలర్ట్.. ఏడాదికి 2 సార్లే..

TGPSC వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) విధానంలో మార్పులు చేసింది. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే OTRలో మార్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతి ఏడాది జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25లోగా చేసుకోవాలని కమిషన్ సూచించింది.
News March 12, 2026
అక్షర్ పటేల్‌కు సారీ చెప్పిన కెప్టెన్ సూర్య

అక్షర్ పటేల్‌కు కెప్టెన్ సూర్యకుమార్ సారీ చెప్పారు. T20 WC S-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతణ్ని తీసుకోకపోవడం తప్పేనని అంగీకరించారు. దీనిపై అక్షర్ కోపం వ్యక్తం చేశారని.. దాంట్లో తప్పులేదని అభిప్రాయపడ్డారు. గ్రూప్ స్టేజ్‌లో చివర నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా అక్షర్ ఆడలేదు. దీంతో SAతో మ్యాచ్‌లో వాషింగ్టన్‌ను సెలక్ట్ చేశారు. దాంట్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News March 12, 2026
ఇరాన్ కండీషన్స్ అమలు సాధ్యమేనా?

యుద్ధం ఆపడానికి ఇరాన్ పెట్టిన <<19359163>>కండీషన్స్<<>> నెరవేరడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్‌లో పాలన మార్పు, అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్/US యుద్ధాన్ని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హక్కులను గుర్తిస్తూ భద్రతకు హామీ ఇవ్వడం జరిగే పనికాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వడానికీ అగ్రరాజ్యం ఒప్పుకోదంటున్నారు. దీంతో యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.


