News March 26, 2025

TSRTA వనపర్తి జిల్లా మెంబర్‌గా జాంగీర్ భాష

image

తెలంగాణ స్టేట్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(TSRTA) వనపర్తి జిల్లా మెంబర్‌గా మహమూద్ జాంగీర్ భాష నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డిలకు జాంగీర్ భాష కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల విజయ చందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 3, 2025

బాబయ్య స్వామికి చాదర్ సమర్పించిన మంత్రి, కలెక్టర్

image

పెనుకొండలో బాబయ్య ఉరుసు మహోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, కలెక్టర్ శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. బాబాఫక్రుద్దీన్ గంధం మహోత్సవం సందర్భంగా మంత్రి, కలెక్టర్ బాబయ్య స్వామికి ప్రభుత్వం తరుఫున చాదర్ సమర్పించారు. మంత్రికి బాబయ్యస్వామి దర్గా వంశ పారంపర్య ముతవల్లి తాజ్ బాబా పూలమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేశారు.

News December 3, 2025

జగిత్యాల: డీసీసీ నియామక పత్రాన్ని అందుకున్న నందయ్య

image

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన నందయ్యకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నియామక పత్రాన్ని అందజేశారు. హైద్రాబాద్ గాంధీ భవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా పాటుపడాలని సూచించారు.

News December 3, 2025

గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

image

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.