News April 11, 2024
‘జీరో బిల్లు’పై స్పందించిన TSSPDCL
TG: గృహజ్యోతి పథకం కింద మార్చిలో జారీ చేసిన జీరో బిల్లులను <<13029804>>వెనక్కి<<>> తీసుకోవడంపై TSSPDCL స్పందించింది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో MLC ఎన్నికల కోడ్ కారణంగా గృహజ్యోతి పథకం ప్రారంభం కాలేదని తెలిపింది. స్పాట్ బిల్లింగ్ మెషీన్‌లో సాంకేతిక లోపం వల్ల జీరో బిల్లు వచ్చిందని వివరించింది.
Similar News
News November 15, 2024
గుజరాత్‌లో 500 కేజీల డ్రగ్స్ పట్టివేత
గుజరాత్ పోర్‌బందర్‌లో సముద్ర మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 500 KGల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టైంది. ఇరాన్ దేశానికి చెందిన బోటులో డ్రగ్స్ తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. సరిహద్దు జలాల్లో నేవీ సాయంతో నడిసంద్రంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.
News November 15, 2024
గత వారం ఓటీటీల్లో వీటికే Top Viewership
*సిటాడెల్ హనీ బన్నీ- 6.7 Million
*దో పత్తీ- 4 M
*ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ (S3)- 3.4 M
* ప్లే గ్రౌండ్ 4: 3.3 M
* విజయ్ 69: 3.2 M, 6. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో: 3 M
* మిత్యా: ది డార్కర్ చాప్టర్: 2.6 M
* రీతా సాన్యాల్ : 2.3 M
*ఈ మూవీస్, వెబ్‌సిరీస్‌లు Netflix, Prime, JioCinema, Disney+ Hotstarలో ప్రసారం అవుతున్నాయి.
News November 15, 2024
కేటీఆర్ అరెస్ట్ అయితే?
‘అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి’ అన్న KTR మాటలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఫార్ములా-1 కేసులో KTR అరెస్ట్ ఖాయమంటూ కాంగ్రెస్ పదే పదే చెబుతోంది. మొన్న అర్ధరాత్రి KTR అరెస్ట్ అవుతారని ప్రచారం జరగ్గా, ఆయన ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. ఆయన అరెస్టైతే త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అరెస్టే జరిగితే ఏ పార్టీకి లాభం అని అనుకుంటున్నారో COMMENT చేయండి.