News January 22, 2026
TTDకి రూ.10 లక్షల విరాళం

చిత్తూరుకు చెందిన చింతల దివ్యాంత్ రెడ్డి అనే భక్తుడు TTDకి విరాళం ప్రకటించారు. శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి రూ.10 లక్షలు విరాళం అందించారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని ఆయన కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు. దాత వెంట మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం ఉన్నారు.
Similar News
News January 24, 2026
ఎయిర్‌పోర్ట్‌లో అస్థిపంజరం కలకలం

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం కనిపించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. టెర్మినల్-3లో లగేజీ తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్‌లో కనిపించింది. వెంటనే పోలీసులు, ఎయిర్‌పోర్ట్ భద్రతా బృందాలు అప్రమత్తమయ్యారు. అయితే అది మెడికల్ విద్యార్థులు ఉపయోగించే డెమో స్కెలిటన్‌గా గుర్తించారు. ఆ బ్యాగ్ వైద్య విద్యార్థిది అని తేల్చారు. అయినప్పటికీ దానిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు.
News January 24, 2026
NZB: కానిస్టేబుల్‌ను కారుతో ఢీ కొట్టిన స్మగ్లర్లు

నిజామాబాద్‌లో మాధవనగర్‌లో గంజాయి తరలిస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించారు. కారు స్తంభాన్ని ఢీకొనడంతో నిర్మల్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఈఎస్ మల్లారెడ్డి తెలిపారు.
News January 24, 2026
మంచిర్యాల: ‘పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’

ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 747 పాఠశాలల్లో చదువుతున్న 37,749 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, రోజు విడిచి రోజు కోడి గుడ్డు అందిస్తున్నామన్నారు. 100 శాతం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


