News December 17, 2025

TTDలో కొత్త ఉద్యోగాలు..!

image

TTDలో త్వరలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్‌వైజర్‌(పాచక) పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని TTD కోరింది. ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 పోస్ట్‌లను పాత నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయడానికి TTD గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ధాన స‌న్నిధి యాద‌వ‌తో పాటు అద‌నంగా మ‌రో స‌న్నిధి యాద‌వ పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపింది.

Similar News

News December 17, 2025

నల్గొండ: @9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

image

నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలలో 9 గంటల వరకు 29.46% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఓటర్లు 2,53,689 ఉండగా 41,285 పురుషులు, 33,439 మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.

News December 17, 2025

కొండెక్కిన వెండి ధరలు

image

వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.11వేలు పెరిగింది. దీంతో ఓవరాల్ రేట్ రూ.2,22,000కు చేరింది. అటు బంగారం ధరలు కూడా మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.650 పెరిగి రూ.1,34,510గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరిగి రూ.1,23,300కు చేరింది.

News December 17, 2025

పెద్దపల్లి: ఉదయం 9 వరకు పోలింగ్ ఎంతంటే..?

image

పెద్దపల్లి జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బుధవారం ఉదయం 9 వరకు 22.50 శాతం పోలింగ్ నమోదైంది. ఎలిగేడు మండలంలో 22.56 శాతం, ఓదెల మండలంలో 19.50 శాతం, పెద్దపల్లి మండలంలో 21.80 శాతం, సుల్తానాబాద్ మండలంలో 26.08 శాతం పోలింగ్ రికార్డైంది.