News October 5, 2025

TTDలో త్వరలో కీలక మార్పులు..!

image

TTD ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టిన నెల రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు, భక్తుల నుంచి వినిపిస్తున్న మాట. చిన్నపొరపాటు కూడా లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. ఈక్రమంలోనే త్వరలో మరికొన్ని మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. బోర్డు మీటింగ్‌లో వీటిని వెల్లడించే అవకాశం ఉంది. తిరుమలలో ఏం మార్చాలో మీరు కామెంట్ చేయండి.

Similar News

News October 5, 2025

కొత్తగూడెం: ఎన్నికల కోసం కాల్ సెంటర్

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం 92400 21456 అనే ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు తమ సందేహాల కోసం ఈ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని కోరారు. ఎన్నికల సంఘానికి సమాచారం అందించడానికి ప్రజలు ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.

News October 5, 2025

విజయనగరంలో ఘనంగా శోభాయాత్ర..

image

విజయనగరం ఉత్సవాల సందర్భంగా ర్యాలీ శోభాయమానంగా ప్రారంభమైంది. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామ సుందర్ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. వివిధ జానపద కళలు, కళారూపాలతో ర్యాలీ కనులవిందుగా సాగి, ప్రజలను ఆకట్టుకుంది. ఉత్సవ వేదికలు ప్రజలతో కళకళలాడాయి. కార్యక్రమంలో TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

News October 5, 2025

వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

image

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.