News October 4, 2025

TTDలో వీరి ట్రాన్స్‌ఫర్లు ఎప్పడు గోవిందా..?

image

ఏళ్ల తరబడి TTDలో ఒకే చోట పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేయడంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు, ఇతర ఆలయాలతో పాటు తిరుపతిలోని ఇతర విభాగాల్లో పనిచేసే సిబ్బందిని బదిలీ చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారట. అయితే బ్రహ్మోత్సవాల అనంతరం వారిపై బదిలీ వేటు పడుతుందని పాలకమండలి సభ్యుల వాదన. బ్రహ్మోత్సవాలు ముగియడంతో ట్రాన్స్‌ఫర్లు ఎప్పడు ఉంటాయో చూడాలి.

Similar News

News October 4, 2025

ఎమ్మెల్యే దొంతికి మాతృ వియోగం

image

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం కలిగింది. మాధవరెడ్డి తల్లి కాంతమ్మ అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ప్రజల సందర్శనార్థం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట వద్ద అంత్యక్రియలు జరపనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.

News October 4, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి

image

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్లు హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండవద్దని సూచించారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.

News October 4, 2025

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: ASF కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలను నిబంధనలకు లోబడి నిర్వహించాలని, జిల్లాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులకు సూచించారు. శనివారం ASFలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో MPTC, ZPTC ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్‌తో కలిసి పరిశీలించారు.