News August 6, 2024
TTDలో సెల్ ఫోన్లు, వాచీల టెండర్ కం వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్ ఫోన్లు, వాచీలు ఆగస్టు 12, 13వ తేదీల్లో టెండర్ కం వేలం(ఆఫ్‌లైన్) నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఇతర వివరాలకు www.tirumala.orgను చూడాలని సూచించింది.
Similar News
News February 28, 2026
తిరుపతిలో బస్సుల దారి మళ్లింపు

తిరుపతి రూరల్ తనపల్లి వద్ద జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. TPT సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి చిత్తూరు, కాణిపాకం, బెంగళూరు వెళ్లే బస్సులను దారి మళ్లించారు. సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి తిరుమల బైపాస్ రోడ్డు, అలిపిరి, టౌన్ క్లబ్ మీదుగా హైవేపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
News February 28, 2026
చిత్తూరు జిల్లాకు రూ.101.30 కోట్ల కేటాయింపు

చిత్తూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగా శనివారం మొదలైంది. జిల్లాలోని 2,33,419 మంది లబ్ధిదారులకు రూ.101.30 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఇంటి వద్దకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇవాళ పింఛన్ పొందలేని వారికి సోమవారం ఇవ్వనున్నారు.
News February 28, 2026
చిత్తూరు పోలీసులకు అవార్డులు

ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికిగాను అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చిత్తూరు అడ్మిన్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఏఆర్ ఎస్ఐ రవి, చిత్తూరు వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పలమనేరు అర్బన్ హెడ్ కానిస్టేబుల్ లీలాసుఖ నాయుడు, చిత్తూరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు, రాళ్లబూదుగూరు హెడ్ కానిస్టేబుల్ పరమేష్ తదితరులు ఉన్నారు.


