News February 27, 2026

TTD ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఈవో

image

TTD ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నరేశ్ కుమార్ ఉన్నారు.

Similar News

News April 19, 2026

అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి?

image

అక్షయ తృతీయ (నేడు) పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిన రోజని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్ర దినాన చేసే స్నానం, జపం, హోమం, దానాలు ‘అక్షయ’మైన (తరగని) ఫలితాలను ఇస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా పేదలకు బట్టలు, గొడుగులు, చెప్పులు, చల్లని మజ్జిగ, నవధాన్యాలు దానం చేయడం విశేషమైన పుణ్యమని తెలుపుతున్నారు. ముఖ్యంగా నీటి కుండను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.

News April 19, 2026

MGU బీటెక్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2,4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.

News April 19, 2026

ఖమ్మం: హారన్‌ కొట్టారని.. కండక్టర్‌పై యువకుడి దాడి

image

రహదారిపై వెళ్తుండగా సైడ్‌ ఇవ్వాలని హారన్‌ కొట్టినందుకు ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే అడ్డుకుని హల్‌చల్‌ చేశాడు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. డ్రైవర్‌ రాంబాబుతో వాగ్వివాదానికి దిగిన సదరు యువకుడు, కండక్టర్‌ మంజుల ఫోన్‌ లాక్కొని దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసిన నిందితుడిని నేలకొండపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.