News February 27, 2026

TTD ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఈవో

image

TTD ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్‌తో పాటు బోర్డు సభ్యులు నరేశ్ కుమార్ ఉన్నారు.

Similar News

News April 19, 2026

ట్రంప్-మునీర్ మైత్రి: అమెరికాకే ప్రమాదం!

image

ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఎంచుకోవడాన్ని అమెరికా రక్షణ నిపుణులు తప్పుబడుతున్నారు. ఇరాన్ సైన్యం, నిఘా సంస్థలు, IRGC నేతలతో ఆయనకు ఏళ్ల నుంచి ఉన్న సంబంధాలే ఇందుకు కారణం. గతంలో అఫ్గాన్ విషయంలో మిత్రదేశంగా నటిస్తూనే తాలిబన్లకు సహకరించిన పాక్ ద్వంద్వ నీతిని మరువరాదని, మునీర్‌ను నమ్మడం వల్ల US వ్యూహాత్మక రహస్యాలు ఇరాన్ చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

News April 19, 2026

కీవ్‌ సూపర్ మార్కెట్‌లో కాల్పులు.. ఆరుగురి మృతి!

image

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌లోని హోలోసివ్స్కీ జిల్లాలో వీధిలో వెళ్తున్న వారిపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం సూపర్ మార్కెట్‌లోకి దూరి కొంతమందిని బందీలను చేసుకున్నాడు. సుమారు 40 నిమిషాల ఉత్కంఠ తర్వాత ప్రత్యేక దళాలు (KORD) జరిపిన ఆపరేషన్‌లో నలుగురు బందీలను విడిపించారు. దుండగుణ్ని కాల్చి చంపారు.

News April 19, 2026

రామగుండం: రక్తమోడుతున్న రోడ్లు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు బలి

image

రామగుండం ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 4న సింగరేణి ఉద్యోగి శ్రీధర్, 7న ఆటో డ్రైవర్ ఇస్మాయిల్, 10న గంగారపు కిష్టయ్య రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ప్రైవేట్ టీచర్ మేరుగు వెన్నెల, తిరునహరి సంతోష్ కుమార్ మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలోనే ఐదుగురు మృత్యువాత పడటంతో రోడ్డు ప్రమాదాలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.