News August 23, 2024
TTD నూతన జేఈవోగా రవికిరణ్..?

త్వరలో టీటీడీ జేఈవోగా జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ MR రవికిరణ్ వస్తారని సమాచారం. ప్రస్తుతం జేఈవోలుగా గౌతమి, వీరబ్రహ్మం ఉన్నారు. వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్‌ను నియమించడానికి ఫైల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు.. ఆ జైలు ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గానూ రవికిరణ్ వ్యవహరించారు. జేఈవోగా ఆయన నియామకంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
Similar News
News January 21, 2026
24న నగరికి సీఎం రాక

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 24న ఆయన నగరికి రానున్నారు. సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భాను ప్రకాష్ హెలిప్యాడ్ స్థల పరిశీలన చేశారు. బహిరంగ సభ, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఉంటుందన్నారు.
News January 21, 2026
చిత్తూరు కలెక్టర్‌కు పురస్కారం

జాతీయ ఓటర్ల దినోత్సవం–2026 సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో విశిష్ట సేవలు అందించినందుకు చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్‌కు అవార్డు లభించింది. అధిక సంఖ్యలో ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కినట్లు అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తూరు జిల్లా ఎన్నికల యంత్రాంగం చేసిన కృషికి ఇది నిదర్శనంగా పేర్కొన్నారు.