News November 20, 2025

TTD అధికారులకు సవాలే..!

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు జరగనుంది. గత దర్శనాల సమయంలో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందు 3రోజులు ఆన్‌లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతించనుంది. తర్వాత 7రోజులు ఎవరైనా వెళ్లవచ్చు. ఇవేమీ తెలియకుండా కొండకు భారీగా వచ్చే భక్తులను అదుపు చేయడం TTD అధికారులకు పెద్ద సవాల్‌గా మారనుంది.

Similar News

News April 4, 2026

BREAKING.. గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం..!

image

గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖని ప్రభుత్వాస్పత్రి నుంచి చౌరస్తా వైపు వెళ్తున్న i20 TS22F3419 కారు వేగంగా వస్తూ రాజేశ్ థియేటర్ సమీపంలో మూలమలుపు వద్ద ఉన్న కరంటు స్తంభాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అందులోనే ఇరుక్కుపోయారు. వారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2026

ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

image

1905: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సంభవించిన భూకంపంలో 20,000 మంది మృతి
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరణం (ఫొటోలో)
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
1979: సినీ నటి సిమ్రాన్ జననం
* గనుల అవగాహన దినోత్సవం
* జాతీయ విటమిన్ ‘సి’ దినోత్సవం

News April 4, 2026

చెపాక్ చెదిరింది.. కంచుకోట చెన్నైకా? ప్రత్యర్థులకా?

image

IPL: ఒకప్పుడు CSK కంచుకోట అయిన చెపాక్ స్టేడియం ఇప్పుడు ఆ జట్టుకు శాపంగా మారింది. హోంగ్రౌండ్‌లో చెన్నై ఓడిపోవడం ఇది వరుసగా ఆరోసారి. చివరగా 2025 మార్చి 23న ఇక్కడ గెలిచింది. ఇక పంజాబ్ ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలిచి ముంబై (5) తర్వాత అత్యధిక సార్లు చెన్నైని చెపాక్‌లో ఓడించిన జట్టుగా నిలిచింది. CSKతో ఆడిన లాస్ట్ తొమ్మిది మ్యాచ్‌లలో 8 సార్లు గెలిచిన PBKS హెడ్ టు హెడ్‌లో 17 విజయాలతో పైచేయి సాధించింది.