News February 27, 2026

TTD అన్నదానం విరాళాల్లో మార్పులు!

image

తిరుమల శ్రీవారి అన్నదానంలో రోజువారి విరాళంతో పాటు తక్కువ మందికీ అన్నదానం చేసే వెసులుబాటు కల్పించేలా టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. 10, 100మందికి చొప్పున కూడా విరాళం ఇచ్చే అవకాశాన్ని కల్పించి.. సామాన్య భక్తులను అన్నదానంలో భాగం చేయాలని ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం రోజు మొత్తానికి రూ.44లక్షలు, ఉదయం టిఫిన్‌కు రూ.10లక్షలు, రాత్రి, మధ్యాహ్న భోజనానికి రూ.17లక్షల చొప్పున విరాళాలు ఇచ్చే అవకాశమే ఉంది.

Similar News

News March 1, 2026

పాక్‌కు చుక్కలు చూపించిన లంక

image

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఆ జట్టును సెమీస్ చేరకుండా ఇంటికి పంపడమే కాకుండా దాదాపు గెలిచినంత పనిచేసింది. 213 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 207 రన్స్ చేసి కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 28 రన్స్ కొట్టాల్సి ఉండగా శనక(31 బంతుల్లో 76*) 3 సిక్సర్లు బాదడంతో పాక్ గజగజ వణికిపోయింది. అయితే చివరి రెండు బాల్స్ డాట్ కావడంతో పాక్ గట్టెక్కింది.

News March 1, 2026

ట్రంప్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్

image

యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఇప్పటివరకు మా వద్ద ఉన్న పాత ఆయుధాలనే ఉపయోగించాం. త్వరలో మేం వాడే వెపన్స్ నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు’ అని హెచ్చరించింది. ఇక వెస్ట్ ఏషియాలోని 14 యూఎస్ బేస్‌లను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దాడుల్లో వందల మంది అమెరికా సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే దీన్ని US ధ్రువీకరించలేదు.

News February 28, 2026

INDvsWI.. పిచ్ రిపోర్ట్ ఇదే

image

T20WC S-8లో రేపు కోల్‌కతాలో 7PMకి IND, WI తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టే సెమీస్ చేరనున్న నేపథ్యంలో మ్యాచుపై ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను బాలెన్స్‌డ్‌గా తయారు చేసినట్లు క్యురేటర్ తెలిపారు. ‘ఈ పిచ్‌పై 200+ స్కోర్ నమోదవుతుంది. 200+ ఛేజ్ చేయవచ్చు. ఏ జట్టు అయితే తమ స్కిల్స్‌ను బాగా ఉపయోగిస్తుందో అదే గెలుస్తుంది. డ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’ అని వివరించారు.