News October 3, 2025
TTD ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్‌లో మార్పులు..!

తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో శుక్రవారం జరిగింది. ప్రస్తుతం 3నెలల ముందు ఆన్‌లైన్‌లో దర్శన టికెట్ల విడుదల చేస్తుండగా ఈ విధానాన్ని మార్చాలని పలువురు భక్తులు కోరారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. 3నెలల అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌లో మార్పులకు ప్రయత్నిస్తామన్నారు. నెల రోజుల ముందే టికెట్లు విడుదల చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి TTD బోర్డు నిర్ణయయం ఎలా ఉంటుందో?
Similar News
News October 3, 2025
తిరుపతిలో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు

తిరుపతిలోని విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, లింక్ బస్టాండ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలకుపైగా బాంబ్, డాగ్ స్క్వాడ్ లు తనిఖీ చేపట్టాయి. మొత్తం రెండు బృందాలు తిరుపతిలోని అధిక రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.
News October 3, 2025
‘స్త్రీనిధి’ చెల్లింపులకు యాప్.. ఎలా వాడాలంటే?

AP: బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్త్రీనిధి వాయిదా చెల్లింపుల కోసం ప్రభుత్వం ‘కాప్స్ రికవరీ’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. అందులో సభ్యురాలి ఫోన్ నంబరు/పిన్‌తో లాగిన్ అవ్వాలి. గ్రూప్ పేరు సెలెక్ట్ చేస్తే లోన్ తీసుకున్నవారి లిస్ట్ కనిపిస్తుంది. పేరు క్లిక్ చేయగానే ఆమె చెల్లించాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. డబ్బు చెల్లించాక రసీదు జనరేట్ అవుతుంది.
News October 3, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఎస్ఈసీ

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, ZPTC ఎలక్షన్స్‌కు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా 1,18,547 ఉన్నాయని తెలిపింది. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దశల వారీగా 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్వోలు, 2,340 మంది ఏఆర్‌వోలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది రెడీగా ఉన్నారని వివరించింది.