News December 27, 2025
TTD ఐటీ విభాగంలో త్వరలో ఉద్యోగాలు

TTD ఐటీ విభాగంలో రోజువారీ కార్యక్రమాల కోసం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గతంలో 34 పోస్టులు భర్తీ చేశారు. అందులో నియామకం ప్రక్రియ జరగనుంది. జీవో నం.149 ప్రకారం ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్(IT) పదవిని అప్‌గ్రేడ్ చేశారు. మరొక జనరల్ మేనేజర్ (IT) పదవిని సృష్టించారు. పదోన్నతి, పరీక్ష విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తిరుపతి ఐఐటీ సహకారంతో నియామకాలు సాగనున్నాయి.
Similar News
News December 27, 2025
డేట్ మార్చారు.. రేటు పెంచారు: ఎక్స్‌పైర్డ్ ఫుడ్‌తో ఆటలు!

UK, US, దుబాయ్ నుంచి తక్కువ ధరకు Expired ఫుడ్ తెప్పించి ఫ్రెష్ ఐటమ్స్‌గా అమ్ముతున్న భారీ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు ₹4.3 కోట్ల విలువైన పాపులర్ బ్రాండ్ల ప్రోడక్ట్స్ సీజ్ చేశారు. కొత్త MRP, Barcodes వేసి టాప్ స్టోర్స్‌తో పాటు ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ అటల్ జైస్వాల్‌తో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News December 27, 2025
సిరిసిల్ల: కూలీల ఆధార్ అనుసంధానం.. 86% పూర్తి

సిరిసిల్ల జిల్లాలో జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం కూలీల ఆధార్ అనుసంధాన కార్యక్రమం 86%కు పైగా పూర్తైంది. 12 మండలాల్లో లక్షా 95వేల 227 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు గుర్తించగా, వీరిలో ఇప్పటివరకు లక్షా 50వేల 442 మంది కూలీల ఆధార్ లింక్ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగితా కూలీల ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఒకరి స్థానంలో మరొకరు పనిచేయకుండా కేవైసీ చేపట్టిన విషయం తెలిసిందే.
News December 27, 2025
ఉల్లి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

AP: ఈ ఏడాది సరైన ధరలు లేక, వాతావరణం అనుకూలించక ఉల్లి రైతులకు భారీ నష్టాలు మిగిలాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. అర్హులైన వారికి పరిహారం అందిచేందుకు రూ.128 కోట్లు విడుదల చేసింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున ఈ సాయం అందించనుంది. ఈ-క్రాప్ ఐడీ ఆధారంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కర్నూలు, కడప జిల్లాల్లో ఇప్పటికే 37,752మంది రైతులకు పరిహారం అందజేశారు.


