News April 16, 2025
TTD గోశాల బాగానే ఉంది: నారాయణ

TTD గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని CPIజాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలోని గోశాలను బుధవారం పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితి, వాటికి అందిస్తున్న దాణా గురించి తెలుసుకున్నారు. ‘గోవులకు కావాల్సినంత దాణా ఉంది. గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు రోజూ పర్యవేక్షిస్తున్నారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయనను సస్పెండ్ కాదు విధుల నుంచి తొలగించాలి’ అని ఆయన కోరారు.
Similar News
News April 16, 2025
2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలి: ఇలా త్రిపాఠి

శివన్న గూడెం రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే గ్రామాల స్థానంలో ఏర్పాటు చేయనున్న పునరావాస కేంద్రాలకు 2 రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె చండూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీదేవి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇతర అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
News April 16, 2025
బాపట్ల: తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి- కలెక్టర్

వేసవిలో బాపట్ల జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. బుధవారం బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో తాగునీటి ఎద్దడి నివారణ పై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మంచినీటి చెరువులలో నీటి శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. త్వరలో విడుదలయ్యే నీటిని మంచినీటి చెరువులకు పంపి చెరువులు పూర్తిస్థాయి నీటి సామర్థ్యంతో ఉండేలా చూసుకోవాలన్నారు.
News April 16, 2025
‘అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలి’

అలంపూర్ నియోజకవర్గంలో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిని నియమించి అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు ఏర్పాటుచేసి వెంటనే అందుబాటులో తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి . వెంకటస్వామి డిమాండ్ చేశారు. CPM ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు GK.ఈదన్న, A.పరంజ్యోతి, రమేశ్, ఉండవెల్లి మండల నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.