News January 21, 2026

TTD చరిత్రలో మొట్టమొదటిసారిగా.!

image

ఓ రిటైర్డ్ IAS అధికారిని TTD తొలిసారిగా జేఈవోగా నియమించడం చర్చనీయాంశమైంది. టీటీడీ జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియమితులైన విషయం తెలిసిందే. ఈయన 2005 బ్యాచ్‌ IAS అధికారి. రిటైర్డ్ అయిన వారి సేవలు కావాలంటే ప్రత్యేకాధికారిగా, సలహాదారులుగా, కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ కింద ఇప్పటి వరకు నియమిస్తున్నారు. అయితే నూతన జేఈవో నియామకంపై ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

Similar News

News January 30, 2026

గుడ్‌న్యూస్.. త్వరలో టీమ్‌లోకి తిలక్ వర్మ?

image

T20 WCకు ముందు టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించనుంది. గాయంతో NZ సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ త్వరలో జట్టులో చేరనున్నట్లు BCCI వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం CoEలో ట్రైనింగ్‌లో ఉన్న ఆయన ఫిట్ అని తేలితే ఫిబ్రవరి 3న టీమ్‌లో చేరతారు. సిమ్యులేషన్ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుండటంతో వర్మ చేరిక కలిసొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News January 30, 2026

రావులపాలెం: సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి.. గ్రూప్-2 జాబ్ సాధించి..

image

రావులపాలెంకు చెందిన కాదులూరు సత్యశ్రీ ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లో విజయం సాధించి అధికారిగా ఎంపికయ్యారు. టీవీ మెకానిక్ సత్యనారాయణ, గృహిణి అన్నపూర్ణ దంపతుల కుమార్తె అయిన సత్యశ్రీ కఠిన పరిస్థితుల్లో చదువుకుని ఈ ఘనత సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్‌కు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2 సాధించారు.

News January 30, 2026

KNR: యాప్ ద్వారానే యూరియా పంపిణీ: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో ఈనెల 31 నుంచి యూరియా విక్రయాలు కేవలం ‘ఎరువుల బుకింగ్ యాప్’ ద్వారానే జరుగుతాయని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. యాప్‌లో ముందే బుక్ చేసుకుని డీలర్ వద్ద కొనుగోలు చేయాలని చెప్పారు. పట్టాదారు పాస్‌బుక్ మొబైల్ నంబర్‌కు అనుసంధానమై ఉండాలని, కౌలు రైతులు యజమాని ఓటీపీతో బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ గడువు మరుసటి రోజు అర్ధరాత్రి వరకే ఉంటుందని,రెండో విడతకు 15 రోజుల విరామం ఉంటుందన్నారు.