News December 14, 2025
TTD నిధులతో SV జూ అభివృద్ధి

తిరుపతిలోని SV జూలాజికల్ పార్క్ అభివృద్ధికి టీటీడీ నుంచి రూ.97 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జంతువుల భద్రత, సందర్శకుల సౌకర్యాల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు. బోర్డు తీర్మానం 474కి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
Similar News
News December 17, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* జుక్కల్: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
* బాన్సువాడ: పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేసిన కలెక్టర్
* బిచ్కుంద: ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి..
* బిక్కనూర్ మండలంలో పెద్దపులి సంచారం
* సదాశివనగర్: ఘనంగా ఎల్లమ్మ పండుగ ఉత్సవాలు
* కామారెడ్డి: నేత్రపర్వంగా కొనసాగుతున్న మల్లికార్జున స్వామి ఉత్సవాలు
News December 17, 2025
KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 17, 2025
నిజామాబాద్: BRS వాళ్లకు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేదు: MLA

ప్రజా సంక్షేమంపై ఆసక్తి లేని BRS, BJPకి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేదని NZB రూరల్ MLA భూపతి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అదే కారణంగా ఓటింగ్ శాతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 80 శాతం వరకు నమోదైందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.


