News August 23, 2024

TTD నూతన జేఈవోగా రవికిరణ్..?

image

త్వరలో టీటీడీ జేఈవోగా జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ MR రవికిరణ్ వస్తారని సమాచారం. ప్రస్తుతం జేఈవోలుగా గౌతమి, వీరబ్రహ్మం ఉన్నారు. వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్‌ను నియమించడానికి ఫైల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు.. ఆ జైలు ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గానూ రవికిరణ్ వ్యవహరించారు. జేఈవోగా ఆయన నియామకంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 1, 2026

జాతీయస్థాయి కోకో జట్టుకు తీర్థం విద్యార్థుల ఎంపిక

image

జాతీయస్థాయి ఖోఖో జట్టుకు తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం లక్ష్మీపతి తెలిపారు. జనవరి 22న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన గంగాధర్, యశ్వంతి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచారు. దీంతో వారు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని HM, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News February 1, 2026

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

image

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్‌తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్‌తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.

News February 1, 2026

చిత్తూరు: 27 వేల మంది పాడి రైతులకు లబ్ధి

image

జిల్లాలో 19న మొదలైన ఉచిత పశు వైద్యశిబిరాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున 37 శిబిరాలు నిర్వహించగా.. 13 రోజుల్లో 718 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. మొత్తంగా 88,303 పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వైద్య సేవలు అందించడంతో 27,656 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లు జేడీ వివరించారు.