News July 5, 2025

TTD బోర్డు ఎప్పుడు ఏర్పాటైందో మీకు తెలుసా..?

image

1841లో హిందూ మత సంస్థల్లో, ఆలయాల్లో జోక్యం చేసుకోకూడదని అప్పటి ఆంగ్ల ప్రభుత్వం చట్టం చేసింది. 1843 ఏప్రిల్ 21న తిరుమల మహంతుల నిర్వహణలోకి వెళ్లింది. 1843 జులై 16 నుంచి 1933 వరకు మహంతుల పరిపాలనలో తిరుమల ఉండేది. 1933 నుంచి 1951 వరకు కమిషనర్‌తో పాటు ఒక కమిటీతో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసేవారు. 1951 హిందూమత చట్టం ప్రకారం కమిషనర్లను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా మార్పు చేశారు. TTD తొలి ఈవో సి.అన్నారావు.

Similar News

News July 6, 2025

NZB: VRకు ఏడుగురు SI

image

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.

News July 6, 2025

జడ్జీలకు హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: సోషల్ మీడియా కేసుల్లో రాష్ట్రంలోని జడ్జీలందరికీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘SM పోస్టుల కేసుల్లో ఆర్నేష్‌ కుమార్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌ కేసు తీర్పులో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడంలేదు. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణ(3-ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో)పై FIRలు నమోదుకు ముందు కచ్చితంగా విచారణ జరగాలి. 14 రోజుల్లోగా విచారణ చేయాలి, అందుకు DSP అనుమతి పొందాలి’ అని స్పష్టం చేసింది.

News July 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (జులై 6, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.